స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం సీట్లు: సీఎం చంద్రబాబు ప్రకటన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లతో సీట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన వర్చువల్ సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీసీలకు మేలు చేస్తున్నామన్నారు. వైకాపా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని నేతలను ఆదేశించారు. ఎన్నికల్లో నేతల పనితీరును అంచనా వేసి రేటింగ్స్ ఇస్తామని చంద్రబాబు హెచ్చరించారు.