ముంబైలో ఎఫ్డీఏ దాడులు, కిచెన్ల లైసెన్సులు రద్దు.

రిపోర్టర్: సురేష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని కిచెన్లపై ఎఫ్డీఏ కొరడా ఝుళిపించింది. కుర్లాలోని రైల్వే కేటరింగ్ బేస్ కిచెన్ మరియు ఇస్కాన్ జుహులోని మూడు రెస్టారెంట్లలో బొద్దింకలు, అపరిశుభ్రత లభించడంతో వాటి లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. ప్రజల ఆరోగ్యంపై చెలగాటమాడితే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎఫ్డీఏ కమిషనర్ తుకారం ముండే స్పష్టం చేశారు.