గూగుల్ మీట్‌లో ఐదు నిమిషాల్లో ఎనభై మంది ఉద్యోగుల తొలగింపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమెరికా

అమెరికాకు చెందిన ఒక బ్యాంక్‌లో పనిచేస్తున్న దాదాపు 80 మంది భారతీయ కస్టమర్ సర్వీస్ ఉద్యోగులను కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌లో తొలగించినట్లు రెడ్ డిట్‌లో వైరల్ అయిన ఒక పోస్ట్ సంచలనం సృష్టించింది. ఆపరేషనల్ కారణాలంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పిన మేనేజ్‌మెంట్, ఆ తర్వాత అత్యవసరంగా మీట్ నిర్వహించి మొత్తం బృందాన్ని ఒకేసారి తొలగిస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.