జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహణ

రిపోర్టర్: రమేష్ స్థలం: జగిత్యాల

జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు SP JAGTIAL వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, చట్టప్రకారం సత్వరమే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.