బొబ్బిలి మండలంలో కోట్ల రూపాయలతో తారు రోడ్ల నిర్మాణ పనులు
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కలిసి రాజుపేట, బంకురువలస గ్రామాలలో రూ.3.30 కోట్ల అంచనా వ్యయంతో తారు రోడ్డు నిర్మాణ పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.