తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై అక్బరుద్దీన్ ఓవైసీ ఆందోళన: తక్షణ చర్యలు కోరుతూ విజ్ఞప్తి

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంపై తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. రాష్ట్రంలో అరవై ఐదు మిలియన్ గ్యాలన్ల మేర తాగునీటి కొరత ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నీటి సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి తక్షణ రక్షణ చర్యలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.