దుగరాజపట్నం కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్: రైల్వేశాఖ ఆదేశం

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

గూడూరు నుంచి దుగరాజపట్నం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ క్లియరెన్స్ ఇచ్చిందని అధికారులు తెలిపారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతన లైన్ సర్వేకు టెండర్లు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వేగవంతమైందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ మార్గాన్ని డబుల్ లైనుగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.