ఒంగోలు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ: భారీ మెజారిటీతో విజయం

రిపోర్టర్: సురేష్ స్థలం: ఒంగోలు

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్ లో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని టీడీపీ దక్కించుకున్నట్లు ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. హోరాహోరీగా సాగిన పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై కూటమి అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప ముప్ పై ఏడు వేలకు పైగా భారీ ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఈసారి కూటమి శ్రేణుల సమన్వయం, అభివృద్ధి నినాదం ఈ అద్భుత విజయానికి బలమైన పునాదిగా నిలిచాయని నాయకులు తెలిపారు.