భక్తిశ్రద్ధలతో నరసింహారెడ్డి కాలనీలో సాగిన అన్నదానం

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం పంచాయతీ పరిధిలోని నరసింహారెడ్డి ఎస్టీ గిరిజన కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ సీనియర్ నాయకుడు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామస్థులు, మహిళలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.