సత్తెనపల్లి మండలంలో బాణసంచా కేంద్రాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సత్తెనపల్లి
సత్తెనపల్లి టౌన్, రూరల్ మండల పరిధిలోని పలు బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాలను తహసీల్దార్ మరియు పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. ధూళిపాళ్ల, నందిగామ ప్రాంతాల్లోని పలు ఫైర్ వర్క్స్ దుకాణాలను పరిశీలించి నిబంధనల అమలును పరిశీలించారు.