స్థానిక ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
రిపోర్టర్: మహేష్
స్థలం: పల్నాడు
నర్సరావుపేటలో స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే తమ అభ్యర్థులకు రక్షణ కరవైందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద అధికార పార్టీ దాడులు జరుగుతున్నాయని, మహిళా అభ్యర్థుల భద్రతను పణంగా పెట్టలేమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పాల్గొనే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.