ఆరోన్ రాడ్జెర్స్ను తిరస్కరించిన మిన్నెసోటా వైకింగ్స్ ఫ్రాంచైజీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Minneapolis

యువ క్వార్టర్బ్యాక్ జేజే మెక్కార్తీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞుడైన ఆరోన్ రాడ్జెర్స్ను తీసుకోలేదని మిన్నెసోటా వైకింగ్స్ యాజమాన్యం వెల్లడించింది. రాడ్జెర్స్ తక్కువ జీతానికే ఆడేందుకు ముందుకొచ్చినప్పటికీ, మెక్కార్తీ జట్టును వీడే అవకాశం ఉందని ఫ్రాంచైజీ ఆందోళన చెందింది. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్ అలెన్ లూయిస్ కథనం ద్వారా వెల్లడించారు. మోకాలి గాయం కారణంగా మెక్కార్తీ తన రూకీ సీజన్ను పూర్తిగా కోల్పోయిన సంగతి తెలిసిందే.