ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారు!
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ఉపయోగించే 'ఆరస్ సెనాట్' బుల్లెట్ ప్రూఫ్ కారు ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చక్రాలపై కవచం కలిగిన కోటలా ఉండే ఈ విలాసవంతమైన లిమోసిన్ కారు అత్యున్నత భద్రతా ప్రమాణాలు, శక్తివంతమైన V8 ఇంజిన్తో పేలుళ్లను సైతం తట్టుకునేలా రూపొందించబడింది.