సేవానిలయాల నిర్మాణానికి అండగా నిలుస్తున్న జనసేన ఎమ్మెల్యే
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం గొల్లలపాలెంలో ఏర్పాటు చేసిన శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్టుకు సేవ చేయడం అదృష్టమని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేశ్ బాబు పేర్కొన్నారు. సుజాతనగర్ క్యాంప్ కార్యాలయంలో ట్రస్టు సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ట్రస్టు భవన నిర్మాణానికి ఏడాది క్రితం శంఖుస్థాపన చేశానని, నేడు రెండస్తుల భవనం పూర్తి కావడం సంతోషకరమని, సీఎస్సార్ నిధులు సేకరించి అభివృద్ధికి సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు.