అయినవిల్లి విఘ్నేశ్వరాలయంలో ఘనంగా సంకటహర చతుర్థి ప్రత్యేక పూజలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐనవిల్లి

సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి శాస్త్రోక్తంగా నిర్వహించిన లఘున్యాస అభిషేకంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఏకదంత స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. భక్తులందరికీ ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి, స్వామివారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు.