పీ4 పర్యవేక్షణకు సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవస్థ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమీక్ష

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో అమలవుతున్న పీ4 విధానం ద్వారా పదకొండు లక్షల మంది కుటుంబాలకు అదనపు చేయూత అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలో మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాల నిరంతర పర్యవేక్షణ కోసం సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తరహా ప్రత్యేక వ్యవస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.