తిరుపతి జిల్లాలో బ్రహ్మోత్సవాల అన్నదానంలో వేడి సాంబారుపడి గాయాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Tirupati
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాంలో జరుగుతున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భారీ అపశ్రుతి చోటుచేసుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానం తయారీ కేంద్రం వద్ద ప్రమాదవశాత్తూ వేడి సాంబారు మీద పడటంతో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితులకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. అయితే వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్య సహాయం కోసం వారిని చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.