ఆస్తిని వారసులకు ఇవ్వడంపై జేమ్స్ బాండ్ నటుడు డేనియల్ క్రెయిగ్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: London
తన పిల్లలకు భారీ ఆస్తులను ఇవ్వడం ఇష్టం లేదని, వారసత్వ సంపదను అందించడం వికారంగా ఉంటుందని ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ స్పష్టం చేశారు. మరణించేలోపు తన సంపదనంతా ఖర్చు చేయడమో లేదా దానధర్మాలు చేయడమో తన ఫిలాసఫీ అని జేమ్స్ బాండ్ నటుడు తెలిపారు. తాను సంపాదించిన ఆస్తులను తర్వాతి తరాలకు పెద్ద మొత్తంలో విడిచిపెట్టబోనని ఆయన వెల్లడించారు.