ఫారం6, 7, 8 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
ఓటరు జాబితా సవరణల్లో భాగంగా అందే ఫారం 6, 7, 8 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జాయింట్ కలెక్టర్ బి. హరిసింగ్ అధికారులను ఆదేశించారు. మోత్కూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహణ తీరును, ఓటర్ల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6, ఓటరు జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ఫారం 7, ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలకు ఫారం–8 దరఖాస్తులను స్వీకరించి, వాటిని నిబంధనల మేరకు పరిశీలించాలని సూచించారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలని జేసీ సూచించారు. కార్యక్రమంలో మోత్కూర్ తహసీల్దార్ పి. జ్యోతి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.