నిరుద్యోగులకు గుడ్ న్యూస్: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
దేశంలోని నిరుద్యోగ యువతకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో రెండు వేల ఎనిమిది అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా వచ్చే నెల నవంబర్ ఆరవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు.