ఘాట్ రోడ్డుపై చిరుతల సంచారం.. వాహనదారుల్లో తీవ్ర భయాందోళన
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలోని చిట్వేలి - రాపూరు ఘాట్ రోడ్డులో రెండు చిరుతలు సంచరించి కలకలం సృష్టించాయి. రోడ్డుపై దర్జాగా తిరుగుతూ రక్షణ గోడపై కూర్చున్న చిరుతలను ప్రయాణికులు వీడియో తీశారు. ఈ ప్రాంతంలో చిరుతల సంచారం పెరుగుతుండటంతో రాత్రివేళల్లో ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.