జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ఎస్పీ జగిత్యాల (@spjagtial) తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చేతన్ నితిన్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు.