నెల్లూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో తీవ్ర జాప్యం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నెల్లూరు
నెల్లూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.102 కోట్ల వ్యయంతో 2023 జనవరిలో ప్రారంభించిన ఈ పనులు కాంట్రాక్టర్ల వివాదాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు 65 శాతమే పూర్తయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించినా పనులు పూర్తికాకపోవడంతో 2027 జూన్ వరకు గడువు పెంచారు. అసంపూర్తి పనులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.