తెలంగాణ జైళ్ల శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కడంపై డీజీ సౌమ్య హర్షం
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
ఖైదీలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన నివృత్తి డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన 109వ స్కోచ్ సమ్మిట్లో జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు వేల మందికి పైగా ఖైదీలకు స్క్రీనింగ్ నిర్వహించి వైద్యం అందించినట్లు అధికారులు తెలిపారు.