ఓబులవారిపల్లిలో ఆలయాల వేదికగా సనాతన ధర్మ పరిరక్షణకు సమరసత సేవ శంఖారావం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఓబులవారిపల్లి

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేట ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల కన్వీనర్ సుబ్రమణ్యం అధ్యక్షత వహించగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గ్రామాలలో దేవాలయాలను కేంద్రంగా చేసుకొని సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఈ సందర్భంగా నిర్వాహకులు నిర్ణయించారు.