వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: గ్రామీణ విలేఖరులకు ఎమ్మెల్యే మురళీ మోహన్ పిలుపు

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి అర్బన్

జర్నలిజంలో వస్తున్న మార్పులను స్వీకరించి, అనుగుణంగా వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని పూతలపట్టు శాసనసభ్యులు కె. మురళీ మోహన్ కోరారు. తిరుపతి జిల్లా గ్రామీణ విలేఖరుల రెండు రోజుల పునశ్చరణ తరగతుల ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ జర్నలిస్టులకు ఇటువంటి తరగతులు నిర్వహించడం ద్వారా వృత్తి నైపుణ్యాలు మెరుగుపడతాయని ఆయన ప్రశంసించారు.