సమంత స్థానంలో చెన్నై స్టోరీ ప్రాజెక్ట్ లోకి శ్రుతిహాసన్ ఎంట్రీ
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
ఇండో-యూకే ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చెన్నై స్టోరీ చిత్రంలో నటి సమంత రూత్ ప్రభు స్థానంలో ప్రముఖ నటి శ్రుతిహాసన్ కథానాయికగా ఎంపికైనట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాఫ్టా అవార్డు విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ సరసన వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నారు. టిమెరి ఎన్. మురారి రాసిన ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ నవల ఆధారంగా చెన్నై నేపథ్యంతో ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ రూపొందుతోంది.