ప్రయాణాల్లో మూత్రం ఆపుకోవడం ప్రమాదకరమంటూ నిపుణుల హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: Bengaluru

సుదీర్ఘ ప్రయాణ సమయాల్లో మూత్రాన్ని పదేపదే ఆపుకోవడం వల్ల బ్లాడర్ బలహీనపడే ప్రమాదం ఉందని బెంగళూరులోని రమయ్య మెమోరియల్ ఆసుపత్రి యూరాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ జావళి వెల్లడించారు. ప్రయాణాల్లో నీళ్లు తాగడం మానేయడం కంటే తగినన్ని ద్రవాలు తీసుకుంటూ టాయిలెట్ విరామాలు పాటించడం ఎంతో సురక్షితమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.