ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కాంగ్రెస్ నిరసనలు

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అనుచిత నిర్ణవాలతో ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర నిరసనలు చేపట్టారు. ఢిల్లీ, లక్నో, గౌహతి సహా పలు నగరాల్లో ఆందోళనలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బ్యారికేడ్లు దాటి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ సహా పలువురు సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.