విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా: నేడు నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల పన్నెండో తేదీన ప్రధాన్ మంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జి.వి.గిరి తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు మరియు రెండు ఫొటోలతో ఉదయం తొమ్మిది గంటలకు నేరుగా హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారికి స్టైపెండ్ చెల్లిస్తారని ఆయన స్పష్టం చేశారు.