ఘాట్రోడ్డుపై అడ్డంగా పడిన చెట్టును తొలగించిన ప్రయాణికులు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: పాడేరు

పాడేరు మండలంలోని 12 మైళ్ల ఘాట్రోడ్డుపై చెట్టు అడ్డంగా పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించకపోవడంతో ప్రయాణికులే చేతులు కలిపి చెట్టును తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేసుకున్నారు. రహదారులపై చెట్లు పడినప్పుడు వెంటనే స్పందించి తొలగించేలా అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు తీవ్రంగా కోరుతున్నారు.