ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో స్నాక్స్ కోసం మహిళల తోపులాట
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో అపశృతి చోటుచేసుకుంది. సభకు హాజరైన మహిళలు స్నాక్స్ కోసం ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట వాతావరణం నెలకొంది. ఎవరికి దొరికినట్లు వారు స్నాక్స్ ప్యాకెట్లను తీసుకువెళ్లేందుకు పోటీపడ్డారు. ఈ ఘటన సభా ప్రాంగణంలో కొంతసేపు గందరగోళానికి దారితీసింది.