నెల్లూరులో లక్ష్మీ కాసులు, చీరలతో వినూత్న వినాయక విగ్రహాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలో భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల వినూత్న గణనాథులను ప్రతిష్టించారు. స్టోన్ హౌస్ పేటలో లక్షల లక్ష్మీ కాసులతో ఒక విగ్రహాన్ని రూపొందించగా, క్లాత్ మర్చంట్స్ మార్కెట్‌లో దాదాపు 695 చీరలతో భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఈ వెరైటీ గణేషులను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.