హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ సరఫరా: కోకాపేటలో ప్రత్యేక ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు జలమండలి కీలక చర్యలు చేపడుతోందని ఎండీ కె. అశోక్‌రెడ్డి తెలిపారు. నిర్మాణ పనులు, పరిశ్రమలు మరియు పార్కుల నిర్వహణ వంటి అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి వినియోగించేలా గ్రీన్ వాటర్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కోకాపేటలో ప్రత్యేకంగా గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై గురువారం ఆయన పరిశీలన జరిపారు.