విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టును ప్రారంభించిన జస్టిస్ బట్టు దేవానంద్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: విశాఖపట్నం

జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం కింద నమోదు చేసిన కేసులను విచారించేందుకు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం హైకోర్టు నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎన్ఐఏ కేసులతోపాటు ఇకపై కొత్తగా నమోదయ్యే కేసులను ఈ ప్రత్యేక కోర్టు విచారించనుంది. జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న ఈ కేసులను సత్వరం విచారించి వేగవంతం చేయాలని జస్టిస్ బట్టు దేవానంద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.