కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన దిలీప్ గవిత్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

బాల్యంలో ప్రమాదవశాత్తు చెయ్యి కోల్పోయిన దిలీప్ మహదు గవిత్ అథ్లెటిక్స్‌లో అద్భుతం సాధించారు. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 100 మీటర్ల టీ47 విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ పురుష పారా అథ్లెట్‌గా రికార్డు సృష్టించారు. ఈ విజయాన్ని తన కోచ్‌ వైజ్ఞాత్‌ కాలేకు గురుదక్షిణగా అంకితమిచ్చారు.