పితృపక్షం సందర్భంగా పేదలకు అల్పాహారం అందించిన ఆలయ ధర్మకర్త

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా ఆసుపత్రి వద్ద పితృపక్షం సందర్భంగా ఆదివారం ఆలయ ధర్మకర్త సన్యాసిరావు పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ పవిత్ర దినాల్లో పేదలకు ఆహారం అందించడం వల్ల పితృదేవతలు శాంతిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూరి, కర్రీతో పాటు రాగి మాల్ట్ పంపిణీ చేయగా అనేక మంది నిరుపేదలు ఆకలి తీర్చుకున్నారు.