పనిచేయని అధికారులను పక్కన పెడతాం: సీఎం చంద్రబాబు హెచ్చరిక
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
సరిగా పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తామని, పనిచేయని వారిని పక్కన పెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలన్నీ సాంకేతికతను అనుసంధానించుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఏడాదిలో ప్రజల సంతృప్త స్థాయి కనీసం 10 శాతం పెరగాలని, ప్రతి జిల్లాలో ఇది 80 శాతం కంటే ఎక్కువగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.