జర్మనీలో నిరసనల ఉద్రిక్తత: హింసాత్మకంగా మారిన యువత ఆందోళనలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఫ్రాంక్ఫర్ట్
జీవన వ్యయం పెరుగుదల మరియు విద్యారంగ నిధుల కోతలను నిరసిస్తూ జర్మనీలో వేలాది మంది యువకులు నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయని పోలీసులు వెల్లడించారు. బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్ సహా పలు నగరాల్ లో ప్రదర్శనలు ఉద్రిక్తతకు దారితీశాయని, దుండగులు దుకాణాలను లూటీ చేస్తూ పోలీసులపైకి రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ అల్లర్లలో భద్రతా సిబ్బంది గాయపడగా, తీవ్రవాద గ్రూపుల ప్రమేయం ఉందని హెసే రాష్ట్ర ఇంటీరియర్ మినిస్టర్ రోమన్ పోసెక్ తెలిపారు.