దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్: నిర్వాహకులకు తీపి కబురు చెప్పిన లోకేష్

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా మండపాల నిర్వాహకులకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు అందించారని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల ముందస్తు అనుమతితో ఏర్పాటు చేసే ప్రతి దుర్గామాత మండపానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. పండుగ వాతావరణంలో విద్యుత్ ఛార్జీల భారం పడకుండా నిర్వాహకులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.