మ్యాన్ హోల్స్ శుభ్రత పేరుతో ఇంకా కొనసాగుతున్న ప్రాణాంతక మరణాలు.
రిపోర్టర్: అశోక్
స్థలం: మహారాష్ట్ర
దేశంలో నిషేధం ఉన్నప్పటికీ మ్యాన్ హోల్స్, సెప్టిక్ ట్యాంకుల శుభ్రతలో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా పనిచేస్తూ కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలు రావాల్సిన నష్టపరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి.