భోపాల్ కేసులో మాజీ జడ్జి గిరిబాల సింగ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

రిపోర్టర్: విజయ్ స్థలం: Bhopal

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో సంచలనం సృష్టించిన త్వీష శర్మ మృతి కేసులో నిందితురాలైన మాజీ జిల్లా జడ్జి గిరిబాల సింగ్ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, డిజిటల్ మరియు ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉందని జస్టిస్ అజయ్ కుమార్ నిరంకారి ధర్మాసనం స్పష్టం చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. వాట్సాప్ చాట్లు మరియు సీసీటీవీ టేజ్ పరిశీలనలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయడం కుదరదని న్యాయస్థానం వెల్లడించింది.