కూటమి సర్కారు తీరుపై నిప్పులు చెరిగిన కొరముట్ల శ్రీనివాసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
వైసీపీని ప్రజలు స్వచ్ఛందంగా గెలిపిస్తారనే భయంతోనే కూటమి ప్రభుత్వం అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. జెడ్పీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు కూటమి నాయకులు టెంకాయలు కొడుతూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.