గణేష్ నిమజ్జనంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ డిసిపి కాజల్ సింగ్, ఎసిపి శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ ఆటంకాలు ఏర్పడకుండా పటిష్టమైన భద్రత, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, సాఫీగా నిమజ్జనం జరిగేలా అన్ని విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నారు.