పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్: అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అధికారులు కీలక శుభవార్త తెలిపారు. సెప్టెంబర్ నెల పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను కంపెనీలు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. వేతన పరిమితి మార్పులు, పేరోల్ సర్దుబాట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగులు తమ పాస్‌బుక్‌లను ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని సూచించారు.