స్వర్ణ సచివాలయ సిబ్బంది చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి నిరాకరణ

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయవాడ

స్వర్ణ గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ రామకృష్ణ స్పష్టం చేశారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నగరంలో ప్రస్తుతం బీఎస్ఎస్ సెక్షన్ 163 మరియు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని, రేపు వినాయక నిమజ్జనాలు ఉన్నందున అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.