జన్నారంలో 16 గంటలుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గురువారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతినగా, 16 గంటలు గడిచినా అధికారులు పునరుద్ధరించలేదు. దీనివల్ల నీటి పథకాలు నిలిచిపోయి ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గత రెండు రోజులుగా మండలంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.