మేయర్ కటారి హేమలతను ఆప్యాయంగా సత్కరించిన ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

రిపోర్టర్: Bharath స్థలం: చిత్తూరు

చిత్తూరు నగర మేయర్గా ఘన విజయం సాధించిన కటారి హేమలతకు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కూటమి చారిత్రాత్మక విజయానికి శ్రమించిన నాయకులు, కార్యకర్తల కృషిని ఆయన కొనియాడారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాబోయే రోజుల్లో చిత్తూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. నగర ప్రజల సంక్షేమమే తమ ప్రాథమిక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.