గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో తరచూ ఎస్సైల మార్పులపై స్థానికుల ఆందోళన
రిపోర్టర్: సతీష్
స్థలం: Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో అధికారుల మార్పులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయని స్థానికులు తెలిపారు. రెండున్నరేళ్లలో ఆరుగురు ఎస్సైలు మారడంపై మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త అధికారులు పరిస్థితులను అర్థం చేసుకునేలోపే బదిలీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పాలనాపరమైన స్థిరత్వం కల్పించి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పూర్తిస్థాయిలో నిత్యం అందుబాటులో ఉండే నూతన ఎస్సైని వెంటనే నియమించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.