సుల్తానాబాద్‌లో వృద్ధాశ్రమం, ప్రత్యేక పాఠశాల సందర్శన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సుల్తానాబాద్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని వృద్ధాశ్రమం, క్యాడర్ ఎంఆర్ స్పెషల్ స్కూల్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సందర్శించారు. ఆమెతో పాటు డీఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్, జూనియర్ సివిల్ జడ్జి డి. గణేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వృద్ధులు, ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులతో న్యాయమూర్తులు ముచ్చటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ఆశ్రమ నిర్వహణపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.